S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/07/2017 - 02:11

కడప/ రాయచోటి, నవంబర్ 6: రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోందని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా సిఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి జన్మభూమి గ్రామకమిటీల పేరుతో దొంగల ముఠా, మాఫియా సామాజ్రాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు.

11/07/2017 - 02:08

అమరావతి, నవంబర్ 6: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలితో లేచి విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజాకు టీడీపీ చెక్ పెట్టనుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని అమలుచేస్తూ ఆమెకు పోటీగా మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ను తెరపైకి తీసుకొస్తోంది. ఈమేరకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

11/07/2017 - 01:51

రాజమహేంద్రవరం, నవంబర్ 6: దేశ సమైక్యతను కాపాడటం అందరి కర్తవ్యమని, మనదేశం, సమాజం పట్ల శ్రద్ధాసక్తులతో ప్రతీ ఒక్కరూ ఉండాలని భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మతం వ్యక్తిగతమని, సంస్కృతి జీవన విధానమని, అది వారసత్వంగా అందిపుచ్చుకుని, భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు.

11/07/2017 - 01:46

వెంకటాపురం (నూగూరు), నవంబర్ 6: భూపాలపల్లి జిల్లా వెంకటాపురం- భద్రాచలం ప్రధాన రహదారి అలుబాక గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన మందుపాతరలను పోలీసులు సోమవారం నిర్వీర్యం చేశారు. ఏటూరునాగారం ఎఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన రహదారిపై కల్వర్టు సమీపంలో ఎవరికీ అనుమానం

11/07/2017 - 01:40

హైదరాబాద్, నవంబర్ 6: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, వాస్తుశిల్పిగా ప్రసిద్ధి పొందిన బిఎన్ రెడ్డి సోమవారం ఉదయం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబీకులు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అప్పటి వరకు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బిఎన్ రెడ్డి మృతి పట్ల టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు.

11/07/2017 - 01:38

హైదరాబాద్, నవంబర్ 6: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో సోమవారం ఎమ్మార్పీఎస్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తమైంది. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తలెత్తిన తోపులాటలో మహిళా కార్యకర్త భారతి మృతిచెందింది. ముట్టడిలో భాగంగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

11/07/2017 - 01:37

సంస్కృతీ సాంప్రదాయాలు, సామరస్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి భక్తి కార్యక్రమాలు ఉపయోగపడతాయని భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో హారతి ఇస్తున్న వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు

11/06/2017 - 04:29

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో మూడురోజల పర్యటన ముగించుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఉదయం వీడ్కోలు పలికారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ వీడ్కోలు పలికినవారిలో ఉన్నారు. వెంకయ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

11/06/2017 - 03:23

హైదరాబాద్, నవంబర్ 5: పాలకుల నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా మహానగరాన్ని డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు వణికిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని సికిందరాబాద్, పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో డెంగ్యూ ఆనవాళ్లు కన్పించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం బాగా చల్లబడటంతో స్వైన్ ఫ్లూ భయం కూడా ప్రజలను వెంటాడుతోంది.

11/06/2017 - 03:20

హైదరాబాద్, నవంబర్ 5: సినీ నటి, మెదక్ మాజీ ఎంపి విజయశాంతి కాంగ్రెస్ ‘తెర’పై మళ్లీ చురుకైన పాత్రలో కనిపించబోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్ళు గడిచాయని, 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు కాబట్టి మళ్లీ విజృంభించాలని కాంగ్రెస్ నాయకులు ఆమెను కోరుతున్నారు.

Pages