S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/18/2016 - 00:39

విశాఖపట్నం, ఆగస్టు 17: జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్ హైవే పెట్రోల్ ఫోర్స్’ ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక ప్రతిపాదనలు పూర్తయ్యాయని రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు విశాఖలో జరగనున్న జాతీయ రహదారి భద్రత సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖ వచ్చిన ఆయన బుధవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు.

08/17/2016 - 04:50

ఖమ్మం, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

08/17/2016 - 02:21

హైదరాబాద్, ఆగస్టు 16: కొత్త జిల్లాల ముసాయిదా నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఈనెల 20న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అఖిలపక్ష సమావేశానికి అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా భాజపా, తెదేపా, సిపిఐ, సిపిఎంలను ప్రభుత్వం ఆహ్వానించింది. పార్టీకి ఇద్దరి చొప్పున ప్రతినిధులు హాజరు కావాల్సిందిగా సూచించింది.

08/17/2016 - 02:19

హైదరాబాద్, ఆగస్టు 16: రాజధానిలో స్తబ్దుగా సాగుతున్న డబుల్ బెడ్‌రూం పథకానికి మళ్లీ చురుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఏడాదిలోగా హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణాల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని సర్కారు నిర్ణయించింది.

08/17/2016 - 02:17

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు (క్లాస్-ఎ) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలకు ఆన్‌లైన్‌లో 19 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తులను దాఖలు చేసేందుకు వచ్చే నెల 7వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 25వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

08/17/2016 - 02:15

ఆదిలాబాద్, ఆగస్టు 16: రైతు సంక్షేమం అజెండాతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, కెసిఆర్ హామీలను తుంగలోతొక్కి రైతులను నిలువెల్లా దగా చేశారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. రుణమాఫీ, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర సాధన కోసం రైతులకు అండగా కాంగ్రెస్ గల్లీనుండి ఢిల్లీవరకు పోరాటాలు సాగిస్తోందన్నారు.

08/17/2016 - 02:04

గుంటూరు, ఆగస్టు 16: ‘నాపై నమ్మకం ఉంచండి. మెరుగైన, పారదర్శకమైన పాలన అందిస్తా. రాష్ట్రంకోసం.. మీకోసం కృష్ణా పుష్కరాల సందర్భంగా సంకల్పం చేయండ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘మనమంతా ఇక్కడే పుట్టాం.. ఈ నీళ్లు తాగాం.. వ్యవసాయం చేశాం.. పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు.. కొందరు విదేశాలకు వెళ్లారు.. చరిత్రలో నదీతీర ప్రాంతాలే నాగరికతకు చిహ్నాలుగా నిలిచాయ’ని అన్నారు.

08/17/2016 - 02:02

గుంటూరు, ఆగస్టు 16: కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు రోజులుగా పుష్కరాలు సజావుగా సాగుతున్నా, ఐదో రోజున కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిది మంది చనిపోయారు. పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ దుర్ఘటన కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో దిడుగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.

08/17/2016 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్‌లో సర్వ శిక్షా అభియాన్ నిధులు భారీగా దుర్వినియోగం అయినట్టు తెలిసింది. వివిధ జిల్లాల్లో సర్వ శిక్షా అభియాన్ పేరుతో వెచ్చించిన వందల కోట్ల రూపాయలకు లెక్కలు తెలియడం లేదు.అందుకు సంబంధించిన రికార్డులు కూడా దొరకడం లేదని తెలిసింది. జిల్లాల్లో సర్వ శిక్షా అభియాన్ సంస్థలకు కలెక్టర్లే చైర్మన్లుగా ఉంటారు. ప్రతి పైసా ఖర్చు కలెక్టర్ల పేరుతోనే జరుగుతుంది.

08/17/2016 - 01:59

హైదరాబాద్, ఆగస్టు 16: మెడిసన్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో మెడికల్ సీట్లు పెరగబోతున్నాయి. తెలంగాణలో మరో మూడు ప్రైవేటు వైద్య కళాశాలల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనుమతినిచ్చింది. ఎంసిఐ దేశంలో 26 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా వాటిలో మూడు తెలంగాణలోనే ఉండటం గొప్ప విషయం. పెరిగిన సీట్లకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి.

Pages