S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/01/2018 - 02:29

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరుగుతాయా? కొద్దికాలంగా రాష్ట్రంలో చర్చనీయాంశ అంశమిది. నిజానికి టెర్మ్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే ఆలోచనవుంటే, ఈ పాటికి ఎన్నికల ఏర్పాట్లు, హడావుడి కనిపించి ఉండేది. కాని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావుడి ఇప్పటి వరకు లేకపోవడంతో ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? అన్న అనుమానం బలపడుతోంది.

05/01/2018 - 03:33

హైదరాబాద్, ఏప్రిల్ 30: జాతీయస్థాయి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ఐఐటి జెఇఇ మెయిన్ పరీక్ష ఫలితాలను సీబీఎస్‌ఈ సోమవారం రాత్రి విడుదల చేసింది. జాతీయస్థాయిలో ఆంధ్ర విధ్యార్థి బోగి సూరజ్ కృష్ణ టాపర్‌గా నిలిచాడు. తెలుగు రాష్ట్రాల విద్యారులూ ఫలితాల్లో దుమ్మురేపారు. తొలి 20 జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్ర నుంచి ఏడుగురు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

05/01/2018 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణం యావత్తూ ఎండలతో అల్లాడుతోంది. అత్యధిక ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పటికీ పగటిపూట ఎండ తీవ్రత జన జీవనాన్ని ఇబ్బంది పెడుతోంది. మేలో ఎండలు మరింత మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరిస్తోంది. మేలో అత్యధిక ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఎప్పుడూ

05/01/2018 - 00:42

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో గడచిన నాలుగు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోచుకున్నారని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇందులో 60 శాతం మొత్తాన్ని విదేశాలకు తరలించారని ఆయన చెప్పారు.

05/01/2018 - 00:38

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటం చూస్తుంటే, రాక్షసులు రాజసూయ యాగం చేస్తున్నట్టుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. అలాగే సీతకోసం వెతుకుతున్న రాముడికి రావణుడు సహకరించినట్టుందని ఆయన విమర్శించారు.

05/01/2018 - 00:36

విశాఖపట్నం, ఏప్రిల్ 30: వెంకన్న సాక్షిగా తెలుగు ప్రజలను వంచించిన మీరే బీజేపీపై నెపం వేస్తూ ధర్మపోరాటం పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో సోమవారం జరిగిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా పదేళ్లన్న బీజేపీ, కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న టీడీపీ, చివరకు ప్యాకేజీకి ప్రజలను మానసికంగా సిద్ధం చేయలేదా అని ప్రశ్నించారు.

04/30/2018 - 16:56

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌లోని వివాహానికి హాజరై కారులో కోటగిరికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

04/30/2018 - 16:53

తిరుపతి:తిరుపతిలో సోమవారంనాడు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. టీడీపీ ఈరోజు నిర్వహించనున్న ధర్మపోరాట సభాస్థలి వద్ద రేకులు గాలులకు ఎగిరిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ తిరుపతికి చేరుకున్నారు. వీరివురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

04/30/2018 - 13:34

తిరుమల: తిరుమల శ్రీవారిని మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలుచేసేందుకు నరేంద్ర మోదీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనంద్‌బాబు వెల్లడించారు.

04/30/2018 - 17:48

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈమేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నా వేళల్లో బయటకు రావద్దని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే కాలంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని వెల్లడించింది.

Pages