S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/23/2016 - 04:58

హైదరాబాద్, సెప్టెంబర్ 22: భారీ వర్షం గురువారం కూడా నగరాన్ని అతలాకుతలం చేసింది. గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను అతలాకుతలం చేశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోందని, హైదరాబాద్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.

,
09/23/2016 - 04:17

విజయవాడ, గుంటూరు, సెప్టెంబర్ 22: బుధవారం రాత్రినుంచి కురిసిన భారీ వర్షాలకు కోస్తాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు జిల్లాలో ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లాలో రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

09/23/2016 - 02:43

కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 22: ఏజన్సీ ఏరియాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పోర్లుతుండటంతో రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండాల మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కినె్నరసాని రిజర్వాయర్‌కు వరదనీరు పెద్ద ఎత్తున రావటంతో గురువారం జెన్‌కో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేశారు.

09/23/2016 - 02:19

హైదరాబాద్ నగరం నిండా మునిగిపోయింది. భవనాలకు భవనాలే జల దిగ్బంధమయ్యాయి. బుధవారం కురిసిన భారీ వర్షం నుంచి కోలుకోక ముందే గురువారమూ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన కుంభవృష్టితో నగరం అతలాకుతలమైంది. రహదారులు నదులనే తలపించాయి. కాలనీలు జలమయం కావడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ వాసులకు ప్రభుత్వం రొట్టెలు, మంచినీటిని పంపిణీ చేసింది. మరోవైపు హుస్సేన్‌సాగర్ ఉప్పొంగుతోంది.

09/23/2016 - 02:01

హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ పరిధిలోని విద్యాసంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు.

09/23/2016 - 01:53

అచ్చంపేట, సెప్టెంబర్ 22: భారీవర్షాలకు పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. మునుపెన్నడూ లేనిరీతిలో పులిచింతలకు నీరు రావడంతో అటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో 13 గ్రామాలు, ఎపిలో గుంటూరు జిల్లాలోని 11 గ్రామాలకు ముంపు ముప్పు ఏర్పడింది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో పులిచింతలకు వరదనీరు పోటెత్తింది.

09/23/2016 - 01:50

గుంటూరు: అనూహ్యంగా కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లాలో ఊరూ ఏరూ ఏకమైంది. రోడ్లకు రోడ్లే కొట్టుకుపోయాయి. కాలనీలు జలమయమయ్యాయి. రైలు, రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీటి ఉద్ధృతికి ఐదుగురు మరణించారు. ఒకరు గల్లంతయ్యారు. జిల్లాలో అత్యధికంగా నకరికల్లులో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఊటుకూరు వద్ద ఉప్పొంగిన వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.

09/23/2016 - 01:46

హైదరాబాద్/ విజయవాడ, సెప్టెంబర్ 22: రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్, బిడిఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద చేరుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. బి కేటగిరి, సి కేటగిరి కింద మెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్ధుల జాబితాలను ఆయా కాలేజీల నుండి సేకరించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు తల్లిదండ్రులను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

09/23/2016 - 01:45

విజయవాడ, సెప్టెంబర్ 22:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పాలనను మరింత సులభతరం చేసేందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పిఎమ్ ఆవాస్ యోజన పథకం కింద సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటు, ఏవియేషన్ రంగం అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించాలనీ నిర్ణయించింది.

,
09/23/2016 - 01:03

హైదరాబాద్, సెప్టెంబర్ 22: పార్టీ మారిన 12 మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు ఏపిలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోంది. 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన విషయం తెలిసిందే.

Pages