S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/21/2016 - 03:24

హైదరాబాద్, సెప్టెంబర్ 20: భారీ వర్షాలతో రాజధాని రోడ్లు గుంతలమయంగా మారడం, నగరంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తుండటంతో మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి పేరొచ్చిందని, అదంతా దెబ్బతిన్న రహదారుల వల్ల మంటగలిసేలా ఉందని కెటిఆర్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

09/21/2016 - 04:25

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జెట్ వేగంతో పరుగులు తీస్తుంటే, సర్కారు విధానం అశాస్ర్తియమంటూ జనంనుంచి పోరుబాట ఉద్ధృతమైంది. కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రజాభిప్రాయం మేరకే జరుగుతుందని సాక్షాత్తూ సిఎం ప్రకటనలు గుప్పిస్తున్నా, ముసాయిదా ముంచేసేలా ఉందంటూ జనం భగ్గుమన్నారు. మంగళవారం అన్ని జిల్లాల్లోనూ ‘కొత్త’ పోరు ఒక్కసారిగా కాకెక్కింది.

09/21/2016 - 04:18

హైదరాబాద్, సెప్టెంబర్ 20:ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల నీటి తగవు ఎట్టకేలకు కేంద్రానికి చేరింది. తెలంగాణలో నిర్మించనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక రైతు రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో, ఇరు రాష్ట్రాలతో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుచేయాలని సుప్రీం ఆదేశించింది. అజెండాలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన అంశాలను కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.

09/21/2016 - 02:58

విజయవాడ, సెప్టెంబర్ 20:ఆంధ్రప్రదేశ్‌ను దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమ స్ఫూర్తితో కదలి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో దోమలపై దండయాత్ర ప్రత్యేక పుస్తకాన్ని, ఎన్‌టిఆర్ శిశు సంరక్షణ కిట్‌ను, మహిళా మాస్టర్ హెల్త్‌కార్డును ఆవిష్కరించారు.

09/21/2016 - 02:56

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 11 వేల కోట్ల మేర రుణభారం మోస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి భవానీప్రసాద్ పేర్కొన్నారు. ఎపిఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయనుందన్నారు.

09/21/2016 - 02:49

గుంటూరు, సెప్టెంబర్ 20: తుని అల్లర్ల ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణపై వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని సిఐడి అధికారులు మంగళవారం మరోసారి విచారించారు. తొలిసారిగా ముద్రగడతో సంప్రదింపులకు సంబంధించిన కాల్‌డాటాపై ప్రశ్నలు సంధించిన సిఐడి అధికారులు మంగళవారం రెండోవిడత విచారించిన అనంతరం ఆయనను అరెస్టుచేసే అవకాశాలు ఉన్నాయని పార్టీనేతలు భావించారు.

09/21/2016 - 02:22

విజయవాడ, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ స్టేషన్‌లో 150 కోట్లతో జరుగుతున్న అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ పనుల కారణంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే అన్ని రకాల రైళ్లను నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ అత్యధిక రైళ్లు యథావిధిగా నడిచాయి.

09/21/2016 - 02:19

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషరేట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం అధికారులను ఆదేశించారు. వీటిని ఈ నెల 26న జరుగనున్న మంత్రిమండలి సమావేశంలో ఆమోదించాలని సిఎం నిర్ణయించారు.

09/21/2016 - 02:16

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరికొన్ని ప్రాజెక్టులకు, సంస్థలకు అనుమతి ఇవ్వడంతో పాటు నిధులను మంజూరు చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కింద దాదాపు 2.50 లక్షల కోట్లు విడుదల చేసేందుకు వీలుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నిధులు రానున్న ఐదేళ్ల వ్యవధిలో విడుదల చేస్తారు.

09/21/2016 - 02:15

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు ఇండియా, ఇంటర్నేషనల్ సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు అంతర్జాతీయ సీఫుడ్ ఫెస్టివల్‌లో భాగస్వామ్యం కానున్నారు.

Pages