S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2016 - 05:31

హైదరాబాద్, జూన్ 25: పదిహేడు ఏళ్ల టిడిపి దుర్మార్గ పాలన వల్లనే తెలంగాణ ఎడారిగా మారిందని, ఇంకా తెలంగాణకు ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆంధ్ర సిఎం చంద్రబాబు రచించిన కుతంత్రంలో టిటిడిపి నాయకులు పాత్ర దారులుగా మారారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/26/2016 - 05:28

హైదరాబాద్, జూన్ 25: అంతర్జాతీయ అణు ఇంధన సరఫరాదార్ల బృందం (ఎన్‌ఎస్‌జి) సభ్యత్వం సాధించేందుకు కేంద్రం అంతగా తాపత్రయ పడాల్సిన అవసరం లేదని ప్రముఖ అణు శాస్తవ్రేత్త, అణు ఇంధన సంఘం (ఎఇసి) సభ్యుడు ఎంఆర్ శ్రీనివాసన్ అన్నారు. అణు ఇంధన సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ బృందంలో చోటు రావడం వల్ల భారత్‌కు ఒరిగేదేమీ లేదన్నారు.

06/26/2016 - 05:27

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉస్మానియా ఆస్పత్రిలో త్వరలో కొత్త టవర్స్ నిర్మించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టవర్స్‌కు శంకుస్థాపన చేస్తారని, నిర్మాణ పనులకు సమాయత్తం కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

06/26/2016 - 05:27

గుంటూరు, జూన్ 25: ‘సచివాలయ ఉద్యోగులకు సకల వసతులు కల్పిస్తున్నాం.. తరలింపులో ఏవైనా తప్పులుంటే మన్నించాలి.. ఏ లోటూ రానివ్వం’ అని ఏపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం వెలగపూడి సచివాలయ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి సచివాలయ పనులు ప్రారంభించి 120 రోజులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంత స్వల్ప వ్యవధిలో ప్రపంచంలో ఏ నిర్మాణాలూ జరగలేదన్నారు.

06/26/2016 - 05:26

హైదరాబాద్, జూన్ 25: నగరంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు భారీగా విదేశీ మధ్యం స్వాధీనం చేసుకున్నారు. మంగళ్‌హాట్, గాంధీనగర్, మీర్‌చౌక్, నారాయణగూడలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది రూ.1.71 కోట్ల విలువైన 7,255 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

06/26/2016 - 05:25

హైదరాబాద్, జూన్ 25: జెఇఇ మెయిన్ అఖిల భారత స్థాయి ర్యాంకులు విడుదల కావడంతో ప్రవేశాలకు షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 28వ తేదీ వరకూ విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు జాయింట్ సీట్ కేటాయింపు అథారిటీ చర్యలు చేపట్టింది. 30న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. మొత్తం నాలుగు దశల్లో సీట్ల కేటాయింపు, ప్రవేశాలు చేపడతారు.

06/26/2016 - 05:14

గుంటూరు, జూన్ 25: అమరావతి ఓ శక్తిపీఠం లాంటిది.. శత్రు దుర్బేధ్యమైంది.. కుతంత్రాలు పనే్నవారికి తిరిగి వారి మెడకే చుట్టుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో నేలపాడు రైతులకు ముఖ్యమంత్రి ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ విభజన తరువాత ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చట్టప్రకారం ఆస్తులు పంపిణీకాలేదు..

06/26/2016 - 05:12

విజయవాడ, జూన్ 25: ప్రపంచ ఆర్థిక వేదికలపై ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించేందుకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. గుంటూరు జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు.

06/26/2016 - 05:08

విశాఖపట్నం, జూన్ 25: స్మార్ట్ పట్టణాల రూపకల్పనలో ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా నవ్యాంధ్ర ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్మార్ట్‌సిటీ మిషన్ ఆలోచనకు ఏడాది పూర్తయిన సందర్భంగా పలు ప్రాజెక్టులకు తుదిరూపునిచ్చిన పట్టణాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/26/2016 - 05:06

గుంటూరు, జూన్ 25: పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం గుంటూరులో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్, ఎపి డబ్ల్యుఎస్‌ఐపి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి మంత్రి దేవినేని ప్రారంభించారు.

Pages