S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/04/2016 - 06:05

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ పోలీస్ అధికారులతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం భేటీ అయ్యారు. సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌జోన్ కమిషనర్లతో ఆయన కాసేపు ముచ్చటించారు. నగరంలో రంజాన్, బోనాల పండుగల సందర్భంగా శాంతిభద్రతలపై చర్చించారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఉగ్రవాదుల చర్యలకు చరమగీతం పాడాలన్నారు.

07/04/2016 - 06:02

హైదరాబాద్, జూలై 3: రంగారెడ్డి జిల్లాలోని రైతులకు జిఓ నెం 123తో అన్యాయం జరుగుతోందని, ఈ జివో ద్వారా రైతులకు రూ. 300 కోట్లు నష్టం జరిగిందని ఉపాధి హామీ పరిహారం ఇవ్వకపోవడంతో మరో వంద కోట్లు నష్టం వాటిల్లిందని తెలంగాణ భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ బి వెంకటేశ్ ఆరోపించారు. భూములు సేకరిస్తున్న ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట్, కందుకూర్, పంజాగూడ గ్రామాల్లో భూ నిర్వాసితుల కమిటీ రెండు రోజులు పర్యటించింది.

07/04/2016 - 06:02

హైదరాబాద్, జూలై 3: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను కిడ్నాప్ చేసేందుకు సిపిఐ మావోయిస్టు పార్టీ పన్నాగం పన్నినట్లు ఏపి పోలీసులు ఆధారాలను సేకరించారు. ఇటీవల ఉత్తరాంధ్ర ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేత ఆజాద్ అలియాస్ గోపాల్ వద్ద బ్యాగులో ఉన్న ల్యాప్‌టాప్‌ను ఏపి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ను ఏపి సైబర్ పోలీసులు విశే్లషించినప్పుడు మావోయిస్టుల కుట్ర కోణం బహిర్గతమైంది.

07/04/2016 - 06:53

హైదరాబాద్, జూలై 3:పాలమూరు జిల్లాలోని పలు ప్రాజెక్టుల కోసం ఏకంగా 86వేల ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఎలాంటి వివాదం లేదు, ఉద్యమాలు లేవు. కానీ మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ఓ నాలుగు గ్రామాల్లో భూ సేకరణ రాష్టస్రమస్యగా మారిపోయింది.

07/04/2016 - 06:00

న్యూఢిల్లీ,జూలై 3: భాజపా తెలంగాణ న్యాయవిభాగం ఇంచార్జిగా సుప్రీంకోర్టు న్యాయవాది అనిశెట్టి చంద్రమోహన్ నియమితులయ్యారు.అలాగే ఆంధ్రప్రదేశ్ న్యాయవిభాగం ఇంచార్జిగా అల్లంకి రమేశ్‌ను నియమిస్తూ భాజపా న్యాయ వ్యవహరాల విభాగం జాతీయ సమన్వయకర్త జగ్‌దీప్ ధన్కర్ నియామక పత్రం విడుదల చేశారు. ఇద్దరూ భాజపా జాతీయ చట్టపర వ్యవహారాల కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

07/04/2016 - 05:59

విజయవాడ, జూలై 3: సోమవారం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనివార్య కారణాలతో ఈ నెల 8వ తేదీ ఉదయానికి వాయిదా పడింది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్‌లు, డైరెక్టర్‌లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం కానున్నారు.

07/04/2016 - 05:59

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 3: హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పక్కనే ఉన్న టూరిజం ప్లాజా హోటల్‌లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఓ మాజీ ఎమ్మెల్యే సహా ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. టూరిజం ప్లాజాలోని 508వ నెంబర్ గదిలో పేకాట శిబిరం కొనసాగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

07/04/2016 - 05:49

తిరుపతి, జూలై 3: వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు సంబంధించి ఇడి గుర్తించిన అక్రమ ఆస్తులను ఆయన స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హితవు పలికారు. ఆదివారం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇడి గుర్తించిన జగన్ ఆస్తులన్నీ ప్రజల సొమ్మన్నారు. అందుకే ఆయన ఆ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడం ఒక్కటే మార్గమన్నారు.

,
07/04/2016 - 05:40

హైదరాబాద్/మహదేవ్‌పూర్, జూలై 3: మేడిగడ్డ (కాళేశ్వరం ప్రాజెక్టు) బ్యారేజీ నిర్మాణానికి కనె్నపల్లి అనువైనదని అధికారులు ఆదివారం గుర్తించారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కాళేశ్వరం పంపు హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. మరోవైపు భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్ యూనిట్‌లో తయారవుతున్న లిఫ్ట్‌లకు సంబంధించిన యంత్రాలను ఈరోజు ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది.

07/04/2016 - 05:34

రాజమహేంద్రవరం, జూలై 3: గోదావరి నదిలో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి ఆదివారం రాత్రి 2,02,207 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజి 175 గేట్లను 0.20 మీటర్ల మేర ఎత్తివేసి జలాలను దిగువకు పంపిస్తున్నారు. ఆదివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 7.70 అడుగుల నీటి మట్టం నమోదు కాగా రాత్రికి 7.80 అడుగులకు చేరుకుంది.

Pages