S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/03/2016 - 06:34

శ్రీకాకుళం, జూలై 2: సరిహద్దులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి. మూడు నెలలు విడిది చేస్తాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు ఎదిగేదాక ఇక్కడే ఉండి, మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. ఇది శతాబ్దాలుగా సిక్కోల్ ప్రజలు తిలకిస్తున్న దృశ్యం. శ్రీకాకుళం జిల్లాలో సందడి చేయడానికి సైబీరియన్ పక్షులు వచ్చేశాయి. పక్షుల రాకతోనే వర్షాలు వస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం.

07/03/2016 - 06:31

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలోని గ్రామాల్లో వేస్తున్న అంతర్గత పైప్‌లైన్లతోనే ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేయాలని ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి అవసరమైన డక్ట్‌లను కొనుగోలు చేయాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు. మిషన్ భగీరథ పనులపై అన్ని జిల్లాల ఎస్‌ఇలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/03/2016 - 06:30

హైదరాబాద్/ చార్మినార్, జూలై 2: ‘మా హైకోర్టు మాకు కావాలి.. దాన్ని సాధించుకునే వరకు పోరాడుతాం. న్యాయమైన మా నాలుగు డిమాండ్లను సాధించుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎంపీలు మా వెంటే ఉన్నారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ధ ధర్నా చేస్తాం. పార్లమెంటునైనా ముట్టడిస్తాం..’ అని రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు అన్నారు.

07/03/2016 - 06:27

విశాఖపట్నం, జూలై 2: విజయవాడలో హిందూ దేవాలయాలను రాత్రికి రాత్రే కూల్చివేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం అని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రుషీకేష్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామి శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. దేవాలయాల నిర్మాణమైనా, వాటిని తొలగించాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే జరగాలన్నారు.

07/03/2016 - 06:25

హైదరాబాద్, జూలై 2: హైకోర్టు విభజనపై చీఫ్ జస్టిస్‌తో చర్చిస్తానని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరానని చెప్పారు.

07/03/2016 - 06:23

రాజమహేంద్రవరం, జూలై 2: సాగునీటి వ్యవస్థలో ఎంతో కీలకమైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ అధికారుల అలక్ష్యానికి గురైంది. కీలకమైన బ్యారేజ్ గేట్ల బ్రేక్ కాయిల్స్ మాయం కావడం, ముగ్గురు ఎఇలు సస్పెండ్ కావడం ఇందుకు అద్దంపడుతోంది. బ్యారేజ్‌కు ప్రస్తుతం నిర్వహణ పనుల్లో భాగంగా మరమ్మతులను రూ.29 కోట్లతో చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యతాలోపం చోటుచేసుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

07/03/2016 - 06:21

హైదరాబాద్, జూలై 2: మంత్రివర్గంలో సీనియర్లను పక్కనపెట్టి, మంత్రి నారాయణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నగర నిర్మాణం, తాత్కాలిక సచివాలయంపై నారాయణకు పెత్తనం ఇవ్వడాన్ని మంత్రులు సహించలేకపోతున్నారు.

07/03/2016 - 06:19

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్‌లో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలన్న కుట్ర కేసులో అరెస్టయిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను రాజధాని శివార్లలోని శామీర్‌పేటలో ఒక విశ్రాంతి భవనంలో ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ) బృందాలు విచారిస్తున్నాయి.

07/03/2016 - 05:45

హైదరాబాద్, జూలై 2: ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణనాధుడు ఈ ఏడాది భక్తులకు శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. శిల్పి రాజేందర్, డిజైనర్ వెంకట్ రూపొందించిన ఏకదంతుని నమూనా చిత్రపటాన్ని శనివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతలరామచంద్రా రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

07/03/2016 - 05:45

హైదరాబాద్, జూలై 2: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను ఏ మాత్రం మెరుగుపరచకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నాలుగు రెట్లు పెంచడం సరి కాదని లోక్‌సత్తా వ్యవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతి, జీతాలు ఎక్కువ, సేవలు మాత్రం తక్కువని, ప్రజలు యాచకుల్లా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి అనే వ్యవస్ధ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

Pages