S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/28/2018 - 13:40

అమరావతి: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమని, ఎవరికైనా తల్లి, తండ్రి దైవంతో సమానమని.. వారిని నిందించడం భారతీయ సంప్రదాయమా? అని ప్రశ్నించారు.

03/28/2018 - 04:26

హైదరాబాద్, మార్చి 27: తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశం ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మంగళవారం నాడిక్కడ విమర్శించారు. ఏదైనా సంకల్పం బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందని పెద్దలు అంటారని, అటువంటి సంకల్పమే లోపించిందని పవన్ పేర్కొన్నారు.

03/28/2018 - 04:17

హైదరాబాద్, మార్చి 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచలేదు. రాష్ట్రంలో ఒక కోటి, 71 లక్షల 68వేల మంది వినియోగదారులు ఉన్నారు. 2018-19 సంవత్సరానికి ఎటువంటి విద్యుత్ చార్జీలను పెంచడంలేదని, పెరిగిన రెవెన్యూ లోటును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ప్రకటించారు.

03/28/2018 - 03:53

చెంచుల పూజలందుకునే లింగమయ్య నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు

03/28/2018 - 03:49

ఒంటిమిట్ట, మార్చి 27: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తికి వటపత్రసాయి అలంకారం చేసి వేదికపై ఆశీనులను జేయించి ప్రత్యేక పూజలు హారతి ఇచ్చారు. అనంతరం మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సింహవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు.

03/28/2018 - 03:51

సూళ్లూరుపేట, మార్చి 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సమాచార రంగంలో ముందడుగు వేసేందుకు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని రూపొందించి ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది.

03/28/2018 - 03:59

సింహాచలం, మార్చి 27: ప్రహ్లాద వరదుడు, జగద్రక్షకుడైన వరాహ నారసింహుడి తిరుకల్యాణమహోత్సవం మంగళవారం సింహగిరిపై అంగరంగ వైభవంగా జరిగింది. భక్త కోటి హరినామస్మరణ మధ్య వేద పండితులు మంత్రాలు వల్లిస్తుండగా నాదస్వర వాయిద్యాల నడుమ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారు శ్రీదేవి,్భదేవులను పరిణయమాడారు.

03/28/2018 - 02:33

ఖమ్మం, మార్చి 27: కల్యాణరాముడు.. రారాజుగా మారాడు. రాజాధిరాజుగా కీర్తిప్రతిష్ఠలు అందుకున్నాడు. జగదభిరాముడైన శ్రీరాముడు శ్రీరామరాజ్యానికి మహారాజుగా పట్ట్భాషిక్తుడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి నాడు పసుపు వస్త్రాలతో సీతా సమేతంగా దర్శనమిచ్చిన కల్యాణరాముడు మంగళవారం వజ్రాల కిరీటం ధరించి మహారాజుగా దర్శనమిచ్చాడు. భక్తుల జయజయ ధ్వానాలతో భద్రాద్రి మార్మోగగా..

03/28/2018 - 03:00

హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించినప్పటికీ కొత్త పంచాయతీరాజ్ చట్టం ఆమోదానికి బుధ, గురువారం రెండు రోజుల పాటు సభ కొనసాగనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా బిల్లును సభలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టబోతుంది. ఈ బిల్లుపై సభలో గురువారం చర్చించి ఆమోదించాక చట్టంగా మారనుంది.

03/28/2018 - 01:25

హైదరాబాద్, మార్చి 27: శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద ‘సరకు’ లేదని, అందువల్ల సభలకు రాకూడదని ప్రణాళిక సిద్ధం చేసుకుని గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని సీఎం కే. చంద్రశేఖరరావు ఆరోపించారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్‌ను కొట్టాలని కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించుకున్నారని అంటూ, గవర్నర్‌ను కొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages