S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/07/2019 - 01:14

హైదరాబాద్: తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్ ద్వారా 8792 మంది టీచర్ల నియామకానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మెరిట్ జాబితాలను ప్రకటించింది. ఆ జాబితాల ఆధారంగా జిల్లాల వారీ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పాత జిల్లాల వారీ ఎంపిక కమిటీలను కలెక్టర్ల అధ్యక్షతన నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి జీవో 10ను శనివారం నాడు విడుదల చేశారు.

07/07/2019 - 01:12

అమరావతి: రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో లాబీయింగ్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర శాసనసభ, సచివాలయం వద్ద నెలరోజులుగా కోలాహలం నెలకొంది. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో, సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, నాయకులు, అనుచరులతో నిత్యం సచివాలయం కిటకిటలాడుతోంది.

07/07/2019 - 01:08

అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల మధ్యంతర భృతికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి 27శాతం మధ్యంతర భృతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ఇది వర్తిస్తుంది.

07/07/2019 - 01:25

హైదరాబాద్/శంషాబాద్, జూలై 6: తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసిస్తుందని, వచ్చే ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేస్తామని, పార్టీ కార్యకర్తలు, నేతలు సమష్టిగా పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్ర, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా దృష్టిని సారించినట్లు ఆయన చెప్పారు.

07/07/2019 - 00:53

అమరావతి, జూలై 6: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులను అన్నివిధాలా ఆదుకుంటూ వారిలో భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లతో పాటు ప్రకృతి విపత్తుల సహాయక నిధిగా మరో రూ. 2వేల కోట్లను వ్యవసాయ మిషన్ పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

07/07/2019 - 04:31

పరకాల, జూలై 6: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి ప్రాజెక్ట్‌కు రూ. 26వేల కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తిని కేంద్రం విస్మరించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని మాదారం కాలనీలోని తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

07/07/2019 - 04:30

భూపాలపల్లి, జూలై 6: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుందని, అందుకు అనుగుణంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కనె్నపల్లి, మేడిగడ్డ ప్రాజెక్టులను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

07/07/2019 - 05:14

గుంటూరు, జూలై 6: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావటాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు, బీజేపీ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 119వ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

07/06/2019 - 13:09

హైదరాబాద్‌: ఇటీవల మరణించిన నటీ, దర్శకురాలు విజయనిర్మల సంతాప సభను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సంధ్యా కన్వెన్షన్‌లో నిర్వహించారు.

07/05/2019 - 22:33

హైదరాబాద్, జూలై 5: బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా నేడు శనివారం శంషాబాద్ వద్ద మామిడిపల్లి గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారుర. రంగనాయకుల తండాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భళంగా విస్తృత ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పరు.

Pages