S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/13/2019 - 23:22

చిత్రాలు..హైదరాబాద్‌లోని లోటస్ పాండులో వై.ఎస్.జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన
సినీ నటుడు రాజా రవీంద్ర, పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)

03/13/2019 - 23:02

హైదరాబాద్, మార్చి 13: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలతో సహ మరో ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన బుధవారం పార్టీ నాయకుడు వెదిరె యోగేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

03/13/2019 - 22:58

హైదరాబాద్, మార్చి 13: భారత్-రష్యాల మధ్య అవినాభావ సంబంధం ఉందని తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రష్యాలోని టామ్స్క్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ అండ్రే అంటోనోవ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఈ బృందం బుధవారం హైదరాబాద్ వచ్చింది. గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

03/13/2019 - 23:37

హైదరాబాద్, మార్చి 13: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బందోబస్తు కోసం పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో తొలివిడతలో జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన ప్రణాళికను పోలీస్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు లక్షమంది బలగాలతో ఎన్నికలను పర్యవేక్షించారు.

03/13/2019 - 22:52

ఖమ్మం, మార్చి 13: ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఆయా పార్టీల తరఫున పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల అనే్వషణలో పడ్డాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీతో పాటు కమ్యూనిస్టులు కూడా బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఆయా పార్టీల అధిష్ఠానాలు దృష్టిపెట్టాయి.

03/13/2019 - 04:40

హైదరాబాద్: వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ ఈ సర్వీసులు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య వారానికి ఒక రోజు 26 వేసవి రైళ్లను నడుపుతారు. 08501, 09502 నెంబర్లతో తిప్పుతారు.

03/13/2019 - 06:44

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో మంగళవారం సాయంత్రం లూప్‌లైన్ పట్టా జాయింట్ బోల్టు ఊడిపోయి పట్టా ఒకటి పైకిలేవడంతో తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గంట పాటు నిలిచిపోయింది. దీని కారణంగా డోర్నకల్ - కాజీపేట సెక్షన్‌లో పలు రైళ్లరాకపోకలకు గంట పాటు ఆటంకం కలిగింది.

03/13/2019 - 04:24

హైదరాబాద్, మార్చి 12: లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలకు, ప్రవేశపరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకున్నా జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు ఇబ్బంది కలిగేలా ఉంది, ఈ క్రమంలోనే కర్నాటక నిర్వహించే కేసెట్ పరీక్షల షెడ్యూలులో మార్పులు చేసింది, అలాగే జేఈఈ అడ్వాన్స్ షెడ్యూలులో కూడా ఒకరోజు అటో, ఇటో మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

03/13/2019 - 02:30

హైదరాబాద్, మార్చి 12: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వివిధ జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మాజీ ఎమ్మెల్యే బాబ్జీ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

03/13/2019 - 02:29

హైదరాబాద్, మార్చి 12: పూతలపట్టు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్‌కు మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ లభించలేదు. జగన్‌ను కలిసేందుకు సునీల్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ నివాసానికి చేరుకున్నారు. అయితే జగన్ నివాసంలోకి వెళ్ళేందుకు సిబ్బంది నిరాకరించారు.

Pages